పారిశుధ్యం, ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి
సైబరాబాద్, ఆగస్టు 7: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజారోగ్యం, పారిశుధ్య కార్యక్రమాల అమలుపై అధికారులు మరింత దృష్టి సారించాలని కమిషనర్ ఆదేశించారు. కమిషనర్‌తో పాటు అదనపు కమిషనర్ (ఆరోగ్యం, పారిశుధ్యం) ఆధ్వర్యంలో జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఆరోగ్య శాఖ అధికారులతో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో బల్క్ వ్యర్థాల ఉత్పత్తిదారుల నమోదు, విద్యుత్ వాహనాల ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు, ఆదర్శ మరుగుదొడ్ల అభివృద్ధి, స్వచ్ఛ భారత్ నిధుల సమర్థ వినియోగంపై విస్తృతంగా చర్చించారు. పట్టణ పారిశుధ్య నిర్వహణలో మరింత మెరుగైన...