రిమ్స్‌లో సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు
ఆదిలాబాద్, (ఆరోగ్యజ్యోతి): రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆదిలాబాద్‌లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులను గౌరవ వేతనం (Honorarium) ప్రాతిపదికన కాంట్రాక్టు విధానంలో భర్తీ చేసేందుకు వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు రిమ్స్ మెడికల్ కళాశాల డైరెక్టర్, సూపరింటెండెంట్ డాక్టర్ జైసింగ్ తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులైన వైద్యుల నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, సీఎంఓ, సివిల్ అసిస్టెంట్ సర్జన్–ఆర్‌ఎంఓ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.ఆయా పోస్టులకు సంబంధించిన...