సంప్రదాయ వైద్యానికి కొత్త వెలుగు.. దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న ‘ఆయుష్’

సంప్రదాయ వైద్యానికి కొత్త వెలుగు.. దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న ‘ఆయుష్’ ఆయుర్వేదం నుంచి యోగా వరకు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశమంతటా ప్రజలకు చేరువవుతున్న సంప్రదాయ వైద్య సేవలు భారతీయ సంప్రదాయ వైద్య విధానాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. తరతరాలుగా ప్రజల ఆరోగ్య సంరక్షణలో భాగమైన సంప్రదాయ వైద్య పద్ధతులను వ్యవస్థీకృతంగా ప్రజలకు అందించడంలో ఆయుష్ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. ఆయుర్వేదం, యోగా & నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి వంటి వైద్య విధానాలు ప్రధానంగా ఆయుష్ పరిధిలో కొనసాగుతున్నాయి. వీటితో పాటు...