మసాలాల పేరుతో విషం..!
హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న భారీ కల్తీ మసాలా ముఠాను హైదరాబాద్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా ఛేదించారు. కాటేదాన్, బాలాపూర్, మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతాల్లో నిర్వహించిన మెరుపు దాడుల్లో నాసిరకం మసాలా దినుసులకు హానికర రసాయనాలు, పారిశ్రామిక రంగులు కలిపి ప్రముఖ బ్రాండ్ల పేర్లతో మార్కెట్లో విక్రయిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మొత్తం 25 టన్నుల కల్తీ మసాలాలు, 89 టన్నులకుపైగా ముడిసరుకు స్వాధీనం చేసుకోగా, ఈ వ్యవహారంలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ముప్పు హోటళ్లు,...